: తెలంగాణలో పోలీసులు చాలా మారిపోయారు: కేసీఆర్


తెలంగాణలో పోలీసుల భాష గతంలోలా లేదని, చాలా మారిపోయిందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. పోలీసులు చాలా హుందాగా, మర్యాదగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. హైదరాబాదు బంజారాహిల్స్ లో కమాండ్ కంట్రోల్ సెంటర్ కు శంకుస్థాపన అనంతరం ఆయన మాట్లాడారు. గతంలో కంటే పోలీసులు చాలా చక్కగా మాట్లాడుతున్నారనే విషయాన్ని తనతో పలువురు ప్రస్తావించారన్నారు. పోలీసులు, ప్రజల మధ్య స్నేహపూర్వక సంబంధాలను మెరుగు పరచుకోవడం ద్వారా శాంతి భద్రతలు సక్రమంగా ఉండేలా చూసుకోవచ్చన్నారు. కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ద్వారా పోలీసు వ్యవస్థ బలోపేతం కానుందన్నారు. ఈ కంట్రోల్ వ్యవస్థను విపత్తు సమయంలో పోలీసులే కాక అందరూ వినియోగించుకోవచ్చని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు కూడా ఈ కంట్రోల్ వ్యవస్థ ద్వారా పర్యవేక్షించవచ్చని కేసీఆర్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News