: ఎంపీలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ భేటీ... పార్లమెంటులో పార్టీ వ్యూహంపై చర్చ


వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ ఎంపీలతో కొద్దిసేపటి క్రితం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. హైదరాబాదులోని లోటస్ పాండ్ లో గల పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న ఈ భేటీలో పార్లమెంటు సమావేశాల్లో పార్టీ అవలంబించాల్సిన వైఖరిపై ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలపై ఏపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇటీవలే జగన్ కూడా గుంటూరులోని నల్లపాడులో దీక్ష చేపట్టారు. మరోవైపు ఈ నెల 26 నుంచి వచ్చే నెల 23 దాకా పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంటులో ఏపీకి ప్రత్యేక హోదా నినాదాలు మిన్నంటే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో విపక్ష పార్టీగా వైసీపీ వ్యవహార సరళి కీలకం కానుంది. అందుకోసమే పార్లమెంటులో ఏ తరహా వ్యూహంతో ముందుకెళ్లాలన్న కోణంలో జగన్ తన పార్టీ ఎంపీలతో సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News