: ‘కమాండ్ కంట్రోల్’కు కేసీఆర్ శంకుస్థాపన... 24 అంతస్తుల భవనానికి రూ.240 కోట్ల కేటాయింపు
భాగ్యనగరి హైదరాబాదులో మరో భారీ భవంతి అందుబాటులోకి రానుంది. నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెం:12లో ఈ ఆకాశ హర్మ్యం నిర్మితం కానుంది. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన కమాండ్ అండ్ కంట్రోల్ విభాగం ఈ భవంతి నుంచే కార్యకలాపాలు సాగించనుంది. తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొద్దిసేపటి క్రితం ఈ భవంతికి భూమి పూజ చేశారు. మొత్తం 24 అంతస్తులతో ఏర్పాటు కానున్న ఈ భవన నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.240 కోట్లను కేటాయిస్తూ ఇటీవలే ఉత్తర్వులు కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే.