: హస్తినకు బాలయ్య పయనం... భారీ ప్రణాళికతో విమానమెక్కిన హిందూపురం ఎమ్మెల్యే
టాలీవుడ్ అగ్ర నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కొద్దిసేపటి క్రితం దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. భారీ ప్రణాళికతో హస్తిన బయలుదేరిన బాలయ్య నేడు అక్కడ బిజీబిజీగా గడపనున్నారు. కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్ తదితరులతో ఆయన ప్రత్యేకంగా భేటీ కానున్నారు. హిందూపురం అభివృద్ధికి సంబంధించి రూ.800 కోట్ల ప్రతిపాదనలతో బాలయ్య హస్తిన బాట పట్టడంపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చకు తెర లేచింది. ఈ నెల 27, 28 తేదీల్లో లేపాక్షి ఉత్సవాలు జరగనున్నాయి. తన సొంత నియోజకవర్గంలో జరుగుతున్న ఈ ఉత్సవాలకు హాజరు కావాలని ఆయన పలువురు కేంద్ర మంత్రులను ఆహ్వానించనున్నారు. బాలయ్య ఢిల్లీ పర్యటనపై అటు ఆయన సొంత పార్టీ టీడీపీలోనే కాక ఇటు మిగతా పార్టీల్లోనూ ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.