: సైక్లాథాన్ లో దగ్గుబాటి రానా సందడి... గుండె సంబంధిత వ్యాధులపై అవగాహనే లక్ష్యమట
గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన పెంచేందుకు హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రి చేస్తున్న ప్రచారానికి టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రానా మద్దతు పలికాడు. నేటి ఉదయం నగరంలోని కిమ్స్ ఆసుపత్రి నుంచి ఐమ్యాక్స్ థియేటర్ దాకా 500 మందితో సైక్లాథాన్ పేరిట ఆసుపత్రి యాజమాన్యం సైకిల్ ర్యాలీని నిర్వహించతలపెట్టింది. దీనిని కొద్దిసేపటి క్రితం దగ్గుబాటి రానా జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. మానవుడి శరీరంలో అత్యంత సున్నితమైనదే కాక, అతి కీలకమైన అవయవం గుండేనని చెప్పిన రానా, దాని పనితీరును మెరుగుపరచుకునేందుకు క్రమం తప్పకుండా సైక్లింగ్ చేయడం మంచిదని పిలుపునిచ్చాడు.