: షూటింగులో ప్రియాంకా చోప్రా ఏడ్చేసిందట!


'బాజీరావ్-మస్తానీ' సినిమా షూటింగ్ సందర్భంగా ప్రముఖ నటి ప్రియాంకా చోప్రా ఏడ్చేసిందని ఆ సినిమా కథానాయకుడు రణ్ వీర్ సింగ్ తెలిపాడు. ముంబైలో 'బాజీరావ్-మస్తానీ' ట్రైలర్ విడుదల సందర్భంగా ప్రియాంకా చోప్రా మాట్లాడుతూ, ఈ సినిమా కోసం తానేమీ అంత కష్టపడలేదని, కష్టం అంతా దీపికా పదుకునే, రణ్ వీర్ సింగ్ లదేనని, తాను సెట్ కి వెళ్లి తొమ్మిది అడుగుల చీర కట్టుకుని, సంప్రదాయ నగలు ధరించేదానినని చెప్పింది. దాంతో వెంటనే మైకు అందుకున్న రణ్ వీర్ సింగ్, "సంజయ్ తో షూటింగ్ చేయలేక సెట్లో మూడో రోజున ప్రియాంకా చోప్రా ఏడ్చేసింది. 'సంజయ్ లీలా భన్సాలీతో రెండోసారి సినిమా చేస్తున్నారు మీకేమైనా పిచ్చా?' అంటూ మాకు కూడా క్లాసు పీకింది" అని చెప్పాడు. తరువాత కొద్ది కాలానికే సంజయ్ లీలా భన్సాలీ పనితీరును అర్థం చేసుకుని అద్భుతంగా నటించిందని రణ్ వీర్ సింగ్ తెలిపాడు. సంజయ్ లీలా భన్సాలీతో రణ్ వీర్ సింగ్, దీపికా పదుకునే గతంలో 'రాంలీలా' సినిమా చేసిన సంగతి తెలిసిందే. కాగా, సంజయ్ తో సినిమా అంటే ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. సీన్ తనకు సంతృప్తిగా వచ్చే వరకు మళ్లీ మళ్లీ చేయిస్తాడన్న పేరుంది ఆయనకు. దీనిని దృష్టిలో పెట్టుకునే ప్రియాంక అలా మాట్లాడింది.

  • Loading...

More Telugu News