: ఉపముఖ్యమంత్రిగా నాకు ఎందుకు అర్హత లేదో చెప్పండి: తేజస్వీ యాదవ్
బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ తనపై వస్తున్న విమర్శలను ఖండించారు. పాట్నాలో ఆయన తన తండ్రి లాలూతో కలిసి మాట్లాడుతూ, తాను ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధినని, అలాంటప్పుడు డిప్యూటీ సీఎంగా ఎందుకు అనర్హుడినో చెప్పాలని డిమాండ్ చేశారు. పుస్తకం కవర్ పేజీని చూసి, పుస్తకం ఇలా ఉంటుందనే నిర్ణయానికి రావద్దని ఆయన స్పష్టం చేశారు. తన తల్లిదండ్రులిద్దరూ ముఖ్యమంత్రులుగా పని చేశారని, ప్రభుత్వ పనితీరు ఎలా ఉంటుందో అప్పుడే అవగాహన చేసుకున్నానని ఆయన వెల్లడించారు. తనకు రాజకీయాల్లో అనుభవం లేదన్నది వాస్తవమే అయినప్పటికీ, వాటిపై అవగాహన లేదని అనుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. తన తల్లిదండ్రుల నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని తేజస్వీ యాదవ్ తెలిపారు.