: నినాదాల 'బాంబులు' కురిపిస్తున్న రష్యా!


ఈజిప్టులోని సినాయి పర్వతం వద్ద రష్యా విమానాన్ని కూల్చేసిన ఐఎస్ఐఎస్ పై రష్యా పోరాటం మరింత తీవ్రం చేసింది. ఫ్రాన్స్ పై ఉగ్రదాడులతో మరింత ఆగ్రహించిన రష్యా ఐసిస్ తీవ్రవాదుల స్థావరాలపై బాంబుల వర్షం కురిపించేందుకు సిద్ధమవుతోంది. ఈ దాడుల్లో వినియోగించే బాంబులపై 'మా ప్రజల కోసం...పారిస్ కోసం' అంటూ నల్ల సిరాతో నినాదాలు రాసి మరీ బాంబులు కురిపిస్తోంది. ఈ విషయాన్ని చెబుతూ, 'మా ప్రజల కోసం...పారిస్ కోసం' అనే నినాదాలను బాంబులపై రాసి ఐసిస్ తీవ్రవాదులకు ఎయిర్ మెయిల్ ద్వారా పంపుతున్నామని రష్యా రక్షణ శాఖ చమత్కరించింది. వచ్చేవారం రష్యా, ఫ్రాన్స్ అధ్యక్షులు రష్యాలోని క్రెమ్లిన్ లో కలుసుకోనున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News