: కొడుకుని దండించిన తల్లికి ఆరు నెలల జైలు శిక్ష!
కొడుకును కొట్టిందని తల్లికి ఆరు నెలల జైలు శిక్ష విధించిన సంఘటన చైనాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... గత ఏప్రిల్ లో లీ అనే మహిళ... హోం వర్క్ చేయడం లేదని, అడిగితే అబద్ధాలు చెబుతున్నాడని తన తొమ్మిదేళ్ల కుమారుడ్ని కొరడాతో కొట్టింది. ఆ కుర్రాడి ఒంటిపై ఉన్న దెబ్బల చారలను చూసిన స్థానికులు ఫోటో తీసి దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఈ ఫోటోలు వైరల్ కావడంతో పోలీసులు బాలుడి తల్లిని విచారించారు. హోం వర్క్ చేయడం లేదని, అబద్ధాలు కూడా ఆడుతున్నాడని, ఇంకోసారి అలాంటి తప్పు చేయకుండా ఉండాలనే అలా కొట్టానని ఆమె చెప్పింది. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. బాలుడిని దారుణంగా హింసించిన ఆ తల్లికి న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష విధించింది.