: వొడాఫోన్ నుంచి మీకు నచ్చిన నెంబర్ పొందొచ్చు


వినియోగదారులకు వొడాఫోన్ సరికొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఆఫర్ ప్రకారం నచ్చిన ఫోన్ నెంబర్ ను వినియోగదారుడు ఎంచుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ ఆఫర్ కేవలం ఢిల్లీ వాసులకు మాత్రమే అందుబాటులో ఉంచినట్టు వొడాఫోన్ తెలిపింది. మొదటి నాలుగు సంఖ్యలను కంపెనీ సూచించిన నెంబర్లను మాత్రమే తీసుకోవాల్సి ఉండగా, మిగిలిన ఆరు నెంబర్లను వినియోగదారుడు తనకు నచ్చిన సంఖ్యలు కోరవచ్చు. ఈ ప్రయోగం సత్ఫలితాలనిస్తే దీనిని దేశవ్యాప్తంగా అమలులోకి తీసుకురానున్నామని వోడాఫోన్ తెలిపింది.

  • Loading...

More Telugu News