: ముందు చికిత్స చేసి, ఆ తరువాత బెంబేలెత్తిపోయిన మేల్ నర్సు!


నవంబర్ 13న పారిస్ లో జరిగిన ఉగ్రదాడి అక్కడి వారికి వివిధ రకాల అనుభవాలు మిగిల్చింది. తను చవిచూసిన అనుభవాన్ని ఓ మేల్ నర్సు ఉద్వేగంతో పంచుకున్నాడు. దాడుల్లో భాగంగా ఓ రెస్టారెంట్ లోకి చొరబడిన తీవ్రవాదులు బీభత్సం సృష్టించారు. దీంతో ఆ ప్రాంతమంతా హాహాకారాలు, రక్తపు మరకలతో నిండిపోయింది. అక్కడే ఉన్న మేల్ నర్స్ డేవిడ్ (46) క్షతగాత్రులకు సాయమందించేందుకు ముందుకు కదిలాడు. ముందుగా గాయపడిన ఓ మహిళకు చికిత్స చేశాడు. ఈ క్రమంలో గాయపడిన ఓ వ్యక్తి వద్దకు చేరుకుని, అత్యవసర సమయాల్లో గుండె కొట్టుకునేందుకు చేసే చికిత్స చేయనారంభించాడు. ఇంతలో అతని చేతికి కొన్ని వైర్లు తగిలాయి. దీంతో వాటిని చూడగా, అవి మరిన్నింటికి అనుసంధానమై ఉన్నాయి. ఇంకా తరచి చూస్తే అక్కడ బాంబు ఉంది. వెంటనే అతను 'మానవబాంబు' అని డేవిడ్ గుర్తించాడు. వైద్యం ఆపేసి, పోలీసులకు సమాచారం చేరవేశాడు. దీంతో అక్కడున్న ప్రజలను ఖాళీ చేయాలని పోలీసులు ఆదేశించారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది వచ్చి, బాంబును నిర్వీర్యం చేశారు. తీరా చూస్తే ఆ బాంబర్ ప్రముఖ ఉగ్రవాది అబ్దెస్లామ్ అని తేలింది. దీంతో డేవిడ్ షాక్ తిన్నాడు.

  • Loading...

More Telugu News