: వరంగల్ లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్


వరంగల్ లోక్ సభ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 5 గంటల లోపు వచ్చి క్యూలో నిలుచున్న వారికి ఓటు వేసేందుకు అనుమతి కల్పిస్తున్నారు. దాదాపు 65 శాతానికి పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తం 23 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఈ నెల 24న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఎన్నికలో ఆయా పోలింగ్ కేంద్రాల్లో తొలి ఓటరుకు పుష్పగుచ్చం ఇచ్చే సంప్రదాయానికి తెర తీశారు. తొలిసారి ఈవీఎంలపై అభ్యర్థుల ముఖచిత్రాలు ఏర్పాటు చేశారు. ఈ ఉప ఎన్నికలోనూ నోటాకు అవకాశం కల్పించారు.

  • Loading...

More Telugu News