: ఇంగ్లాండ్ లో 'ఫస్ట్ ఏషియన్ ఉమెన్ ఫుట్ బాలర్ ఆఫ్ ది ఇయర్' గా భారత్ మహిళ


భారత్ కు చెందిన అదితి చౌహాన్ అనే యువతి చరిత్ర సృష్టించింది. ఇంగ్లాండ్ లో 'ఫస్ట్ ఏషియన్ ఉమెన్ ఫుట్ బాలర్ ఆఫ్ ది ఇయర్' గా ఎంపికైంది. లండన్ లో జరిగిన థర్డ్ ఏషియన్ ఫుట్ బాల్ అవార్డ్స్ కార్యక్రమంలో అవార్డును అందుకుంది. తొలిసారి ఓ భారత మహిళ ఈ అవార్డును సాధించడం విశేషం. ఢిల్లీకి చెందిన అదితి రెండు సంవత్సరాల కిందట లండన్ లోని లాబరో యూనివర్శిటీలో స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ లో చేరింది. వర్శిటీ ఫుట్ బాల్ జట్టు తరపున ఆడుతోంది. అవార్డు రావడం పట్ల అదితి సంతోషం వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News