: పారిస్ దాడులతో సంబంధం ఉన్న బెల్జియం వాసిని అరెస్ట్ చేసిన టర్కీ పోలీసులు
ఫ్రాన్స్ రాజధాని పారిస్ దాడులపై దర్యాప్తు వేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో టర్కీలో పోలీసులు ఓ బెల్జియం జాతీయుడిని నిర్బంధంలోకి తీసుకున్నారు. పారిస్ దాడులతో అతనికి సంబంధం ఉందని టర్కీ పోలీసులు భావిస్తున్నారు. గత శనివారం ఐఎస్ఐఎస్ కి చెందిన ఉగ్రవాదులు పారిస్ లో దాడులకు తెగబడి 129 మంది అమాయక ప్రజలను పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మాలి రాజధాని బావుమాలో రాడిసన్ బ్లూ హోటల్ పై ఉగ్రవాదులు పంజా విసిరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ అంతర్గత భద్రతను పటిష్ఠం చేశాయి. ఈ నేపథ్యంలోనే బెల్జియం వాసిని టర్కీ పోలీసులు పట్టుకున్నారు.