: ఆసియన్ సదస్సులో మోదీ భేటీలో ఇబ్బందికర పరిణామం


కౌలాలంపూర్ లో జరుగుతున్న ఆసియన్ సదస్సులో భారత్ కు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. జపాన్ ప్రధాని షింజో అబెతో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీకి ముందు ఇద్దరు నేతలు ఫొటోల కోసం మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో వెనుక ఎగుర వేసిన మన జెండా తలకిందులుగా ఉంది. అయితే, జరిగిన తప్పుకు నిర్వాహకులు క్షమాపణలు చెప్పారు. తొందరగా ఏర్పాట్లు చేయడంలో పొరపాటు జరిగిందని, దురదృష్టకర ఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సదస్సులో భాగంగా భారత్-జపాన్ ప్రధానులు ఇద్దరూ ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

  • Loading...

More Telugu News