: తీవ్రవాదులతో కాంగ్రెస్ చేతులు కలిపింది: పంజాబ్ డిప్యూటీ సీఎం


కాంగ్రెస్ పార్టీపై పంజాబ్ డిప్యూటీ సీఎం సుఖ్ బీర్ సింగ్ బాదల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ అశాంతికి కాంగ్రెస్ పార్టీనే కారణమని మండిపడ్డారు. తీవ్రవాదులతో కాంగ్రెస్ చేతులు కలిపిందని ఆరోపించారు. జాతి వ్యతిరేక శక్తులకు నిధులు ఇస్తూ, వారిని కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తోందని అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతలపై మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, సుఖ్ బీర్ వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా స్పందించారు. తమ చేతగానితనాన్ని ఇతర పార్టీలపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News