: షీనా కేసుతో నా తండ్రికి సంబంధంలేదు: రాహుల్ ముఖర్జియా
సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జియా భర్త, మీడియా టైకూన్ పీటర్ ముఖర్జియాని అరెస్టు చేసి, కూడా నమోదు చేశారు. అయితే ఈ కేసుతో తన తండ్రికి ఎలాంటి సంబంధం లేదనీ, అమాయకుడని పీటర్ కొడుకు రాహుల్ ముఖర్జియా అన్నాడు. తన తండ్రిపై చేసిన ఆరోపణలు దారుణమని ఖండించాడు. ముంబైలోని సీబీఐ ఆఫీసులో ఈరోజు తన తండ్రిని కలిసేందుకు వచ్చిన సమయంలో పీటర్ కుమారుడు మీడియాతో మాట్లాడాడు. మరోవైపు తాను అమాయకురాలినని ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఇంద్రాణి మీడియాతో చెప్పింది. భర్త పీటర్ కు కేసుతో ఉన్న సంబంధంపై మాట్లాడేందుకు ఆమె నిరాకరించింది.