: వరంగల్ పోలింగ్ ప్రశాంతం... ఇప్పటి వరకు 40 శాతం పోలింగ్


వరంగల్ లోక్ సభ ఉప ఎన్నిక పోలింగ్ సజావుగా, ప్రశాంతంగా కొనసాగుతోంది. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ బూత్ లకు వస్తున్నారు. ఉదయం 11 గంటల సమయానికి 27.69 శాతం ఓటింగ్ నమోదు కాగా, 12 గంటలకు 40 శాతం నమోదయింది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినప్పటికీ, ఎన్నికల సిబ్బంది వాటిని వెంటనే సరిచేశారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 5 గంటల్లోపు బూత్ కు చేరుకున్న ఓటర్లందరికీ ఎంత సమయమైనా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అనుమతించనున్నారు.

  • Loading...

More Telugu News