: అతన్ని చూసి నేర్చుకోండి... స్టార్ల పుత్రరత్నాలకు వర్మ వ్యంగ్య సలహా!
టాలీవుడ్ సూపర్ స్టార్ల కుమారులపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెటైర్లు విసిరాడు. యంగ్ హీరో రాజ్ తరుణ్ ను చూసి స్టార్ల కుమారులు నేర్చుకోవాలని సూచించాడు. తెలుగు సినిమా హద్దులను చెరిపేస్తున్న రాజ్ తరుణ్ ను చూస్తుంటే తనకు ఎంతో గర్వంగా ఉందని ట్వీట్ చేశాడు. స్టార్ వారసులు సినీ ప్రేక్షకులను ఇడియట్స్ గా భావిస్తున్నారని... అందుకే ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీస్తున్నారని విమర్శించాడు. టాలీవుడ్ లో బాహుబలి లాంటి భారీ సినిమాలు, కుమారి 21ఎఫ్, భలేభలే మగాడివోయ్ లాంటి కథాబలం ఉన్న చిత్రాలు మాత్రమే విజయం సాధిస్తాయని అన్నాడు. కుమారి 21ఎఫ్ సినిమా విషయంలో రాజ్ తరుణ్, హేబా పటేల్ లకు వర్మ శుభాకాంక్షలు తెలిపాడు.