: మేయర్ దంపతుల కుటుంబ సభ్యులకు పోలీస్ భద్రత


చిత్తూరు మేయర్ కఠారి అనురాధ దంపతుల హత్య నేపథ్యంలో పోలీసులు వారి కుటుంబ సభ్యులకు గట్టి భద్రత కల్పించారు. వారి కొడుకు కఠారి ప్రవీణ్, మేయర్ తమ్ముళ్లు గోపి, కిషోర్, కార్పోరేటర్ కందా, కఠారి మోహన్ కు నమ్మినబంటుగా ఉన్న ప్రసన్నలను కూడా హత్య చేయాలని ప్లాన్ చేసినట్టు పోలీసుల అదుపులో ఉన్న దుండగులు విచారణలో తెలిపారు. దాంతో మేయర్ ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు హత్య జరిగిన సమయంలో దుండగుల దాడిలో గాయపడిన సతీష్ వేలూరు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం అతన్ని చిత్తూరు డీఎస్పీ లక్ష్మీనాయుడు విచారించారు. ఇతనికి సైతం పోలీసులు భద్రత కల్పించారు.

  • Loading...

More Telugu News