: ఇక చెట్టినాడు సిమెంట్స్, గోయెంకా బ్రదర్స్ వంతు!.. ఐపీఎల్ జట్ల కొనుగోలుపై ఆసక్తి


విశ్వవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన దేశీయ క్రికెట్ టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఎంట్రీ ఇచ్చేందుకు పారిశ్రామిక దిగ్గజాలు అమితాసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే బీసీసీఐ చీఫ్ హోదాలో ఇండియా సిమెంట్స్ అధినేత ఎన్.శ్రీనివాసన్ చెన్నై సూపర్ కింగ్స్ తో సత్తా చాటారు. అయితే ఆ తర్వాత వెలుగుచూసిన స్పాట్ ఫిక్సింగ్ కారణంగా ఏకంగా ఆయన క్రికెట్ కే దూరం కావాల్సి వచ్చింది. శ్రీని స్థానాన్ని భర్తీ చేసేందుకు ఆయన పారిశ్రామిక వైరివర్గం చెట్టినాడు గ్రూపు ఉవ్విళ్లూరుతోంది. శ్రీని సొంతూరు చెన్నైకే చెందిన చెట్టినాడు గ్రూపు... రద్దైన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల స్థానంలో కొత్తగా బరిలోకి దిగనున్న జట్లలో ఓ జట్టును కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతోంది. ఇక చెన్నైకే చెందిన మరో పారిశ్రామిక కుటుంబం గోయెంకా గ్రూపు కూడా ఐపీఎల్ జట్టును చేజిక్కించుకునేందుకు రంగంలోకి దిగినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ రెండింటితో వీడియోకాన్ కూడా ఐపీఎల్ జట్ల బిడ్డింగ్ లో పాలుపంచుకునేందుకు సన్నాహాలు చేస్తోంది.

  • Loading...

More Telugu News