: ఉస్మానియాలో మళ్లీ బీఫ్ ఫెస్టివల్... ఉద్రిక్తత
హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్శిటీలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు కొన్ని విద్యార్థి సంఘాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. డిసెంబర్ 10వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని వామపక్ష సంఘాలు, దళిత, మైనార్టీ సంఘాల నేతలు నిర్ణయించారు. 'సేవ్ ఫుడ్ డెమోక్రసీ' పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో, ఉస్మానియాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీజేపీ అనుబంధ ఏబీవీపీ ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తోంది. గతంలో కూడా 2012లో ఉస్మానియాలో బీఫ్ ఫెస్టివల్ ను నిర్వహించినప్పుడు తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. పెద్ద గొడవ జరిగింది. అయితే, దేశంలో సగం మంది బీఫ్ తింటారని, ధర తక్కువగా ఉండటమే దీనికి కారణమని ఏఐఎస్ఎఫ్ నేత శంకర్ అంటున్నారు. దేశంలో అసహనం ఉండటం మంచిది కాదని, ప్రజల ఆహారంపై నియంత్రణ ఉండటం సరైంది కాదని చెప్పారు.