: కాంట్రాక్టర్లకు కేసీఆర్ బంపర్ ఆఫర్!


టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిఖార్సైన కార్యదక్షుడు. నిర్దేశించుకున్న పనిని ముగించేందుకు ఆయన ఎంతదాకా అయినా వెళతారనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఏకబిగిన 14 ఏళ్ల పాటు ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా నిలిపిన ఆయన ఎట్టకేలకు తన లక్ష్యాన్ని సాధించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైంది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ కు జనం పట్టం కట్టారు. కొత్త రాష్ట్రంలో తొలిసారి అధికార పగ్గాలు ఆయనకే కట్టబెట్టారు. మరి ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయాల్సిందే కదా. ప్రస్తుతం కేసీఆర్ అదే పని చేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టు విషయంలో పనులు నత్త నడకలు సాగుతున్న వైనం మనకు తెలిసిందే. అయితే కొత్త రాష్ట్రంలో పనుల సాగదీత ఇకపై కుదరదని కేసీఆర్ నిన్న తేల్చిచెప్పారు. గతంలోలా పనులను నిర్దేశిత కాలంలో పూర్తి చేయని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు నిన్న సాగునీటి శాఖ అధికారులతో జరిగిన సమీక్షలో ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పనుల్లో జాప్యం చేసే కాంట్రాక్టర్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించిన ఆయన, నిధుల్లో కోత పెట్టాలని నిర్ణయించారు. అయితే నిర్దేశిత సమయంలోనే పనులు పూర్తి చేసే కాంట్రాక్టర్లకు ఆయన బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఒప్పంద పత్రంలో పేర్కొన్న సమయంలోగానే పనులు పూర్తి చేసే కాంట్రాక్టర్లకు సదరు పని విలువలో 1 శాతం మొత్తాన్ని ప్రోత్సాహకంగా ఇవ్వనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News