: ముగిసిన మాలి ఆపరేషన్...18 మంది అతిథులు హతం
మాలి రాజధాని బమాకోలోని రాడిసన్ బ్లూ హోటల్ లో మాలి, ఫ్రెంచ్, ఐక్యరాజ్యసమతి భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. ఈ ఆపరేషన్ లో 18 మంది అతిథులు మృత్యువాత పడినట్టు భద్రతా బలగాలు తెలిపాయి. చాకచక్యంగా హోటల్ లో అడుగు పెట్టిన భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. అనంతరం హోటల్ లో చిక్కుకున్న అతిథులను విడుదల చేశారు. ఈ దాడిలో 20 మంది భారతీయులు క్షేమంగా బయటపడ్డారు. వీరు దుబాయ్ కి చెందిన ఓ కంపెనీలో విధులు నిర్వర్తిస్తున్నారని సమాచారం. మృతుల్లో బెల్జియం దౌత్యవేత్త కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.