: మూడో టెస్టుకు స్టెయిన్ అనుమానమే...సఫారీలకు పెద్ద దెబ్బే!


తొలి టెస్టులో ఓడి, రెండో టెస్టులో తొలి రోజు ఆటలోనే ఆలౌట్ అయిన సఫారీలకు మరో దెబ్బ తగిలింది. రెండో టెస్టులో గాయపడ్డ డేల్ స్టెయిన్ మూడో టెస్టులో ఆడేది అనుమానంగా మారింది. సౌతాఫ్రికా బౌలింగ్ దాడిని నడిపించే స్టెయిన్ గాయపడడం సఫారీలకు పెద్ద దెబ్బే. వికెట్ టు వికెట్ బౌలింగ్ చేసే స్టెయిన్ ఆడేది అనుమానంగా మారడంతో మరో పేసర్ మర్చంట్ డీ లాంజ్ కు అవకాశం కల్పించనున్నారు. మర్చంట్ డీ లాంజ్ కు సఫారీలు పిలుపునిచ్చారు. మోర్నీ మోర్కెల్, రబడా, అబాట్ ఉన్నప్పటికీ ఈ ముగ్గురిలో ఎవరైనా గాయపడితే మర్చంట్ కు అవకాశం కల్పించనున్నారు. అంత వరకు మర్చంట్ రిజర్వ్ ఆటగాడిగా కొనసాగనున్నాడు. కాగా, ఈ సిరీస్ లో 1-0తో టీమిండియా ముందంజలో ఉంది.

  • Loading...

More Telugu News