: హెడ్ కానిస్టేబుల్ వెకిలి చేష్టలు!
ఓ ప్రత్యేక మహిళా పోలీసు అధికారి ఒళ్లో ఒక హెడ్ కానిస్టేబుల్ కూర్చున్న సంఘటన దుమారం రేపుతోంది. జమ్మూకాశ్మీర్ లోని రాజౌరి జిల్లా పోలీస్ స్టేషన్ లో జరిగిన ఈ సంఘటన వివరాలు... ఆ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ పేరు జకీర్ హుస్సేన్. అదే పోలీస్ స్టేషన్ లో ఆ మహిళా పోలీసు ప్రత్యేక అధికారి కూడా పనిచేస్తోంది. మరి, ఎందుకు కూర్చున్నాడో తెలియదు కానీ, వెళ్లి ఆమె ఒళ్లో అమాంతం కూర్చున్నాడు. అక్కడే ఉన్న మిగిలిన సిబ్బంది ముందే ఇదంతా జరిగింది. అయితే, ఎవరో ఒక వ్యక్తి ఈ దృశ్యాన్ని ఫొటో తీసి వాట్సప్ లో పెట్టాడు. ఆ ఫొటోలో మహిళా అధికారి నవ్వుతూ కనిపిస్తుండగా, హెడ్ కానిస్టేబుల్ మాత్రం సిబ్బంది వైపు చూస్తున్నాడు. అయితే, ఈ విషయం ఆ నోటా ఈ నోటా వెళ్లి పోలీసు బాసులకు చేరింది. దీంతో మండిపడ్డ అధికారులు జకీర్ హుస్సేన్ ను సస్పెండ్ చేశారు.