: ఇంటికొకరు చొప్పున ఉద్యమంలో చేరండి: మావోయిస్టుల పిలుపు
ఖమ్మం జిల్లాలో మావోయిస్టుల పోస్టర్లు వెలిశాయి. ఖమ్మం జిల్లాలో కిడ్నాప్ చేసిన టీడీపీ నేతల ఆచూకీపై ఎలాంటి సమాచారం ఇవ్వని మావోలు, డిసెంబర్ 2 నుంచి 8 వరకు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ 15వ వార్షికోత్సవ ఉత్సవాలు గ్రామగ్రామాన జరపాలని కరపత్రాలు, బ్యానర్లు విడిచి వెళ్లారు. ప్రజా యుద్ధంలో పాల్గొనేందుకు ఇంటికొకరు చొప్పున సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. దున్నేవాడిదే భూమి అనే నినాదంతో జరుపుతున్న ప్రజా ఉద్యమంలో ప్రతి ఇల్లు భాగస్వామ్యం కావాలని వారు సూచించారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి బ్యానర్లు, కరపత్రాలు స్వాధీనం చేసుకున్నారు.