: ఆ ఉగ్రవాది తలకు రూ.33 కోట్లు!...రివార్డు ప్రకటించిన అమెరికా


జర్బా, అమెరికా, యూరప్ దేశాల నుంచి ఉగ్రవాదాన్ని పెంచి పోషించే నిమిత్తం నిధుల సేకరణలో కీలక పాత్ర పోషిస్తున్న కరుడుగట్టిన ఐఎస్ ఉగ్రవాది అబు మహ్మద్ అల్ షిమాలి అలియాస్ తిరద్ అల్ జర్బా తలకు అమెరికా వెలకట్టింది. అతని సమాచారం తెలిపిన వారికి సుమారు రూ.33 కోట్లకు పైగా చెల్లిస్తామని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు అధ్యక్షుడు ఒబామా నిన్న రాత్రి ఆమోదం తెలిపారు. కాగా, అల్ ఖైదా ఉగ్రవాద సంస్థలో కూడా జర్బా పనిచేశాడు. 2005వ సంవత్సరంలో ఐఎస్ఐఎస్ లో జర్బా చేరాడు. విదేశీ సైన్య వ్యూహాలను ముందుగానే పసిగట్టడంలో, నష్టాన్ని అంచనా వేయడంలో జర్బా మంచి నేర్పరి అని సమాచారం. ఇతర దేశాలపైకి దాడులకు ప్రణాళిక చేసినప్పుడు, ఏయే ప్రాంతాలనుంచి వెళ్లాలో చెప్పడంతోపాటు ఇమ్మిగ్రేషన్ వ్యవహారాలు కూడా జర్బానే చూసుకుంటాడని సమాచారం. జర్బాను హతమారిస్తే ఇస్లామిక్ స్టేట్ కు గండికొట్టినట్లవుతుందని అమెరికా భావిస్తోంది. యువతను ఉగ్రవాదులుగా మార్చడంలో, వారిని ఆకర్షించడంలో జర్బా కీలకపాత్ర పోషిస్తాడని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News