: 'షికాగో' లో 'గోదావరి' రుచులు


అమెరికాలోని తెలుగు వారికి అచ్చ తెలుగు వంటకాలను, గోదావరి ప్రాంత రుచులను అందించాలనే ఏకైక లక్ష్యంతో అవతరించిన 'గోదావరి గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్' అనతి కాలంలోనే అంచెలంచెలుగా విస్తరిస్తోంది. ఇప్పటికే మసాచుసెట్స్ లోని వోబర్న్, నార్త్ కరోలినాలోని రేలీ, న్యూయార్క్ లోని హిక్స్ విల్లేలో తెలుగు రుచులను అందిస్తున్న ఈ సంస్థ... తాజాగా తన రుచులను షికాగోకు తీసుకురాబోతోంది. నవంబర్ 21న (శనివారం) 'గోదావరి షికాగో' రెస్టారెంట్ అట్టహాసంగా ప్రారంభం కాబోతోంది. షికాగోలో భారతీయులు ఎక్కువగా నివసించే షాంబర్గ్ ప్రాంతంలోని వెస్ట్ గోల్ఫ్ రోడ్ లో 'గోదావరి షికాగో' తెలుగువారి కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. స్థానిక 'న్యూ పటేల్ బ్రదర్స్'కు ఇది సమీపంలో ఉంది. రెస్టారెంట్ ప్రారంభ దినోత్సవాన నోరూరించే వంటకాలు మనకోసం వేచి చూడబోతున్నాయి. గుండమ్మ గారి గారెలు, పెదరాయుడు పెసరట్టు, నాయుడు గారి నాటు కోడి, పిఠాపురం పీతల వేపుడు, ఆల్వాల్ పాయా సూప్ తదితరాలు మనల్ని అలరించడానికి సిద్ధమవుతున్నాయి. వీటితో పాటు రాజమౌళి రసగుల్లా, కాకినాడ కాజా, బామ్మ గారి చక్కర పొంగలిలాంటివి అతిథులకు వారి సొంత ఊర్లను గుర్తుకు తెచ్చేలా ఉండబోతున్నాయి. మరో విషయం ఏంటంటే, ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత చంద్రబోస్ తో పాటు పలువురు గాయకులు శనివారం ఉదయం గోదావరిలో అల్పాహారం స్వీకరించనున్నారు. గోదావరి షికాగోలో... రెస్టారెంట్ తో పాటు ఫుల్లీ ఆపరేషనల్ బార్ కూడా ఉంది. ప్రత్యేకమైన కేటరింగ్ టీమ్ ను కలిగి ఉండటం గోదావరి స్పెషాలిటీ. మరో గొప్ప విషయం ఏమిటంటే... న్యూయార్క్ లోని గోదావరి రెస్టారెంట్ టీమ్ ఇటీవల 850 మందికి పైగా అతిథులకు అద్భుతమైన కేటరింగ్ సేవలను అందించింది. వీరిలో సినీ నటులు జీవిత, రాజశేఖర్ కూడా ఉన్నారు. ఓ కార్యక్రమంలో వీరిద్దరూ గోదావరి రుచులపై పొగడ్తలు కూడా కురిపించారు. 'గోదావరి షికాగో' ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ సంస్థ ప్రతినిధి కౌశిక్ కోగంటి మాట్లాడుతూ, భారతీయులు ముఖ్యంగా తెలుగు వారు అధికంగా ఉండే షికాగోకు తమ కార్యకలాపాలను విస్తరించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అమెరికాకు వచ్చిన తర్వాత సొంత ఊరి రుచులకు దూరమైన బాధను గోదావరి రెస్టారెంట్ తీరుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని... గోదావరిలో అడుగుపెట్టిన ప్రతిసారి అద్భుతమైన అనుభూతిని అందిస్తామని చెప్పారు. రేపటి 'స్పెషల్ గ్రాండ్ లంచ్ బఫే'తో షికాగోలో ప్రారంభమయ్యే గోదావరి ప్రయాణం విజయవంతంగా కొనసాగుతుందనే నమ్మకం తమకుందని తెలిపారు. గోదావరి షికాగో అడ్రస్... GODAVARI CHICAGO 167 W GOLF ROAD SCHAUMBURG, IL-60195. Ph: 630-340-9760 కాంటాక్ట్... VARUN MADISETTY VARUN@GODAVARIUS.COM 630-340-9760 www.Godavarius.com

  • Loading...

More Telugu News