: బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ అత్యధిక స్కోరు 19!
బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కు చిన్ననాటి నుంచి క్రికెటర్ గా రాణించాలని బలమైన కోరిక ఉండేది. దీంతో క్రికెటర్ గా నిరూపించుకోవాలని చిన్న నాటి నుంచి ప్రయత్నించాడు. బీహార్ ఆటగాడిగా రంజీల్లో స్థానం సంపాదించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో తేజస్వీ యాదవ్ చేసిన అత్యధిక పరుగులు 19 కావడం విశేషం. అదే సమయంలో బౌలింగ్ గణాంకాలు 1/10 నమోదు చేశాడు. కుడిచేతి వాటం బ్యాట్స్ మన్ అయిన తేజస్వీ యాదవ్ కు ఐపీఎల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించింది. అయితే అంతంత మాత్రమే ప్రతిభ కలిగిన తేజస్వీ యాదవ్ విరామాల్లో ఆటగాళ్లకు డ్రింక్స్ అందించాడు. చివరికి క్రికెట్ లో ఎలాగూ రాణించలేనని తెలుసుకున్న తేజస్వీ యాదవ్ రాజకీయాల్లో అరంగేట్రం చేశాడు. బరిలో దిగిన తొలి ఎన్నికల్లో విజయం సాధించడం, డిప్యూటీ సీఎం కావడం చకచకా జరిగిపోయాయి.