: చక్కని షేవింగుకి పది చిట్కాలు!


గడ్డం చేసుకోవడం కూడా ఓ కళే. కొన్ని టిప్స్ పాటిస్తే చక్కగా గడ్డం చేసుకోవడం చాలా తేలికని డెర్మటాలజిస్టులు, నిపుణులైన బార్బర్లు చెబుతున్నారు. వారు సూచించిన టిప్స్ లో కొన్ని... * గడ్డం చేసుకునే ముందు చల్లగా లేదా వేడిగా ఉన్న నీటిని కాకుండా మధ్యస్తంగా ఉన్న నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. వేడి నీటిని మాత్రం వాడవద్దు. ఎందుకంటే, చర్మం ఓవర్ డ్రై అయి మంటపుడుతుంది. * ముఖ్యంగా ఉదయం సమయంలో గుర్తుంచుకోవాల్సిన విషయం. నిద్ర లేచిన వెంటనే కాకుండా కనీసం 10 నిమిషాల తర్వాత షేవ్ చేసుకోవడం మంచిది. * వారంలో ఒకరోజు గడ్డం షేవ్ చేసుకోవద్దు. తద్వారా ముఖ చర్మానికి కొంత ఒత్తిడిని తగ్గించినట్టవుతుంది. * షేవింగ్ జెల్ లేదా క్రీమ్ రాసుకునేటప్పుడు మునివేళ్లతో సర్క్యులర్ మోషన్ పద్ధతిని అనుసరించాలి. * గడ్డంపై రేజర్ ను ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రేజర్ ను అదిమిపెట్టకుండా షేవ్ చేసుకుంటే చర్మం పాడవకుండా ఉంటుంది. * అడ్డదిడ్డంగా కాకుండా ఒక క్రమ పద్ధతిలో షేవ్ చేసుకుంటే చర్మం దెబ్బతినకుండా ఉంటుంది. * చర్మం సున్నితంగా ఉండి తొందరగా మంట పుడుతుందనుకునేవారు షేవింగ్ ఆయిల్ ను ఉపయోగించాలి. * అంతగా తెగని బ్లేడ్ ను వాడవద్దు. ఎందుకంటే, షేవింగ్ చేసుకున్న ఫీలింగ్ ఉండకపోగా చర్మం మంటపుడుతుంది. * ఎలక్ట్రిక్ షేవర్ ను వినియోగించే వారు తమ పరికరం పని తీరు 100 ఎంపీహెచ్ లేదా అంతకంటే ఎక్కువగా ఉంటేే చర్మంపై గాట్లు పడిపోతాయి. * ఆల్కహాల్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉన్న ఆఫ్టర్ షేవ్ లోషన్స్ కు దూరంగా ఉండాలి. అందుకు ప్రత్యామ్నాయంగా ఆఫ్టర్ షేవ్ బామ్ లేదా మాయిశ్చరైజర్ ను ఉపయోగిస్తే చర్మానికి హాయిగా ఉంటుందని వారు సూచించారు.

  • Loading...

More Telugu News