: వరంగల్ లో ఈసారి పోలింగ్ శాతం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం: భన్వర్ లాల్
గతేడాది జరిగిన ఎన్నికల కంటే ఈసారి వరంగల్ కు జరగనున్న ఉపఎన్నికలో పోలింగ్ శాతం పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్ లాల్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియను లైవ్ వెబ్ కాస్టింగ్ చేయడానికి 800 మంది విద్యార్థులను నియమించినట్టు చెప్పారు. ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. ఓటరు చీటీలు ఇప్పటికే ఇంటింటికీ పంపిణీ చేసినట్టు తెలిపారు. విధుల్లో పాల్గొనే సిబ్బంది వారికి కేటాయించిన ప్రాంతాలకు తరలివెళ్లినట్టు పేర్కొన్నారు. మద్యం షాపులను రేపు సాయంత్రం 5 గంటల వరకు బంద్ చేయించినట్టు చెప్పారు.