: 80 మంది బందీలకు విముక్తి
వెస్ట్ ఆఫ్రికాలోని మాలి రాజధాని బమాకోలోని రాడిసన్ బ్లూ హోటల్ లో బందీలైన 170 మందిలో 80 మందిని ఉగ్రవాదులు విడిచిపెట్టినట్టు వార్తలు వెలువడుతున్నాయి. బందీలను ఉగ్రవాదులు ముస్లింల పవిత్ర గ్రంధం ఖురాన్ లోని వాఖ్యాలు చెప్పాలని కోరినట్టు, వాటిని చెప్పిన వారిని వదిలినట్టు సమాచారం. కాగా, తొలుత 20 మందిని ముస్లింలుగా నిర్ధారించుకున్న ఉగ్రవాదులు వారిని హోటల్ విడిచి వెళ్లిపోవాలని కోరినట్టు వార్తలు వెలువడ్డాయి. ఈ సంఖ్య 80కి చేరింది. కాగా, ఉగ్రదాడి నుంచి కొందరు వ్యక్తులు అదృష్టవశాత్తూ పోలీసుల సహాయంతో తప్పించుకోగలిగారు. వారిలో గినియా దేశానికి చెందిన ప్రఖ్యాత గాయకుడు సెకౌబా బాంబినో కూడా ఉన్నారు. కాగా, ఈ దాడిలో 10 మందిని ఉగ్రవాదులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే.