: రాడిసన్ హోటల్ లో నేను లేను: ఆఫ్రికా బిలియనీర్ అలికో డాన్గోటే


మాలిలోని రాడిసన్ హోటల్ లో తాను లేనని ఆఫ్రికా అత్యంత ధనవంతుడు అలికో డాన్గోటే స్పష్టం చేశారు. నైజీరియాకు చెందిన అలికో డాన్గోటే ఆఫ్రికాలోని అత్యంత ధనవంతుడిగా ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. నిన్నటి వరకు మాలిలో ఉన్నానని, ఈ రోజు అక్కడ లేనని ఆయన స్పష్టం చేశారు. కాగా, నేడు మాలిలోని రాడిసన్ హోటల్ పై ఉగ్రవాదులు దాడి చేసి 170 మందిని బందీలుగా చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ బందీలలో అలికో డాన్గోటే కూడా ఉన్నారంటూ వార్తలు వెలువడ్డాయి. దీంతో ఆయన స్పందించారు. తాను క్షేమంగా ఉన్నానని, అసలు తాను మాలిలో లేనని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. కాగా, వివిధ దేశాలకు చెందిన టూరిస్టులు బందీలుగా ఉండడంతో ఈ ఘటనపై ప్రపంచం మొత్తం ఆసక్తి వ్యక్తం చేస్తోంది.

  • Loading...

More Telugu News