: బందీల్లో 15 మంది భారతీయులు, ఏడుగురు చైనీయులు


పశ్చిమ ఆఫ్రికా దేశం మాలీ రాజధాని బమాకాలో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. రాడిసన్ బ్లూ హోటల్ పై దాడి చేసిన ఉగ్రవాదులు దాదాపు 170 మందిని బందీలుగా చేసుకున్నారు. వీరిలో 15 మంది భారతీయులు కూడా ఉన్నారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. అంతేకాకుండా చైనా దేశానికి చెందిన ఏడుగురు కూడా ఉన్నట్టు సమాచారం. టర్కిష్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఆరుగురు సిబ్బంది కూడా ఉన్నారు. మరోవైపు ఇప్పటివరకు తొమ్మిది మందిని ఉగ్రవాదులు బలి తీసుకున్నట్టు సమాచారం. వారి వద్ద భారీ ఎత్తున పేలుడు పదార్థాలు ఉన్నాయని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News