: మిశ్రాను పక్కన పెట్టి బిన్నీని ఎంపిక చేయడంపై కోహ్లీ వివరణ


అమిత్ మిశ్రాను పక్కన పెట్టి స్టువర్ట్ బిన్నీని ఎంపిక చేయడంపై వచ్చిన విమర్శలకు టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వివరణ ఇచ్చాడు. జట్టు అవసరాలకు తగ్గట్టు మార్పులు చేర్పులు జరుగుతుంటాయని అన్నాడు. టీమిండియాలో ఇంకా సరైన కాంబినేషన్ ఏర్పడలేదని అభిప్రాయపడ్డాడు. పరిస్థితులను బట్టి జట్టును ఎంపిక చేయాల్సి ఉంటుందని కోహ్లీ తెలిపాడు. జట్టు అవసరాలకు అనుగుణంగా జట్టును ఎంపిక చేస్తారు తప్ప, ఎవరినో ఎంపిక చేయాలనే లక్ష్యంతో మూర్ఖంగా వ్యవహరించమని అన్నాడు. గత కొన్నేళ్లుగా అమిత్ మిశ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ, పరిస్థితులకు అనుగుణంగా రవీంద్ర జడేజా, స్టువర్ట్ బిన్నీలను సెలెక్టర్లు ఎంపిక చేశారని కోహ్లీ తెలిపాడు. ఈ పరిస్థితిని మిశ్రా అర్థం చేసుకుంటాడని కోహ్లీ ఆశాభావం వ్యక్తం చేశాడు. కాంబినేషన్ సెట్ కాలేదు కనుక ప్రయోగాలు చేస్తున్నామని, అది జట్టుకు లాభిస్తుందని కోహ్లీ తెలిపాడు.

  • Loading...

More Telugu News