: తిరుమల కొండల్లో జలపాతమూ శ్రీహరి తిరునామమే!
ప్రకృతి సృష్టించే అద్భుతాలు అనేకం. అందులో తిరుమల గిరులంటే... ఏ వైపు నుంచి చూసినా ఆ శ్రీహరి రూపమే కనిపిస్తుంది. ఓ వైపు నుంచి చూస్తే తిరుమల గిరులు శ్రీ వెంకటేశ్వరుడు పడుకున్నట్టుగా కనిపిస్తాయి. ఇక కిందకు దిగి వచ్చే రహదారిలో ఒక చోట గరుత్మంతుడి ఆకృతి కనిపిస్తుంది. శ్రీవారి విగ్రహం ఎంత ఎత్తుంటుందో, సరిగ్గా అంతే ఎత్తులో సహజసిద్ధ శిలాతోరణం గుడికి వెనుక భాగంలో కనిపిస్తుంది. ఇక నిన్నమొన్నటి భారీ వర్షాలకు కొండల పై నుంచి జాలువారుతున్న జలపాతాలు సైతం శ్రీవెంకటేశ్వరుని తిరునామాల ఆకృతిలో దర్శనమిస్తూ, భక్తులను అలరిస్తున్నాయి. ఘాట్ రోడ్డులోని వినాయక స్వామి ఆలయం సమీపంలో ఈ దృశ్యం కనిపిస్తుండగా, అది స్వామివారి మహిమేనని భక్తులు విశ్వసిస్తున్నారు. ఆ దృశ్యం ఇదే.