: చిత్తూరు మేయర్ హత్యకేసులో సీకే బాబు అనుచరులపై అనుమానం: డీజీపీ


చిత్తూరు నగర మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త మోహన్ దారుణంగా హత్య చేయబడ్డ కేసులో మాజీ ఎమ్మెల్యే సీకే బాబు అనుచరులపైనా తమకు అనుమానాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు వ్యాఖ్యానించారు. ఈ కేసులో ఇంతవరకూ ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని వెల్లడించిన ఆయన, దర్యాఫ్తును మాత్రం ముమ్మరంగా జరుపుతున్నామని, ఘటనలో పాత్రధారుల కన్నా, వారి వెనకుండి నడిపించినవారే తమకు ముఖ్యమని ఆయన అన్నారు. నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టబోమని తెలిపారు. అనుమానితులను అందరినీ ప్రశ్నిస్తున్నామని, చింటూ లొంగిపోయినట్టుగా వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News