: చైనాలో 28 మంది ఉగ్రవాదుల హతం
చైనా పోలీసులు 28 మంది ఉగ్రవాదులను హతమార్చారు. గత అక్టోబర్ లో జిన్ జియాంగ్ ప్రావిన్స్ లోని బొగ్గు గనిపై దాడి చేసి 16 మందిని ఈ ఉగ్రవాద సంస్థ కు చెందిన వారు పొట్టనబెట్టుకున్నారని పోలీసు అధికారులు చెప్పారు. ఈ దాడులకు పాల్పడిన నాటి నుంచి ఉగ్రవాదుల కోసం గాలిస్తుండగా వారు తారసపడటంతో హతమార్చామని చెప్పారు. అయితే ఈ ఉగ్రవాద సంస్థ పేరును పోలీసులు ప్రకటించలేదు. 2008లో ఏర్పాటైన ఈ ఉగ్రవాద సంస్థ వేర్పాటు వాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు అధికారులు చెప్పారు.