: మరోసారి గాలి జనార్దన్ రెడ్డి అరెస్టు
అక్రమ మైనింగ్ కేసులో నిందితుడు గాలి జనార్దన్ రెడ్డి ని పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) శుక్రవారం నాడు ఆయన్ని అదుపులోకి తీసుకుంది. కాగా, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఇనుప ఖనిజాలను అక్రమంగా విదేశాలకు తరలించారనే ఆరోపణలపై గతంలో పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు విషయమై సీబీఐ విచారణ చేయడం, దాదాపు మూడేళ్ల పాటు ‘గాలి’ జైలులో వుండడం తెలిసిందే.