: అతిరథ మహారథుల సమక్షంలో నితీశ్ ప్రమాణస్వీకారం
జేడీ(యు) అధినేత నితీశ్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నాలోని గాంధీ మైదాన్ లో ఈ రోజు నితీశ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. రాష్ట్ర గవర్నర్ రాం నరేష్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఐదోసారి ముఖ్యమంత్రిగా నితీశ్ రాష్ట్ర బాధ్యతలు చేపట్టడంతో ఆ పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేశారు. అతిరథ మహారథులందరూ తరలివచ్చిన ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి జేడీ(యు) నేతలు, కార్యకర్తలు, ప్రతిపక్ష నేతలు, పలు పార్టీల అధ్యక్షులు హాజరయ్యారు.