: మరో కీలక పదవికి భారత సంతతి మహిళను ఎంచుకున్న ఒబామా

ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా భారత సంతతి మహిళ స్వాతీ దండేకర్ ను నియమిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వెల్లడించారు. ఆమెతో పాటు మరికొందరినీ ఏడీబీ బోర్డులో చేరుస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ నూతన టీం, అమెరికా ముందు నిలిచిన సవాళ్లను తమ చాతుర్యంతో ఛేదిస్తారని భావిస్తున్నట్టు తెలిపారు. కాగా, స్వాతీ దండేకర్ 2003లో అమెరికా దిగువ సభకు ఎన్నికైన తొలి భారత మహిళగా రికార్డు నెలకొల్పారు. ఆపై 2009-11 మధ్య సెనెట్ సభ్యురాలిగానూ సేవలందించారు. నాగపూర్ యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీని, ఆపై ముంబై వర్శిటీ నుంచి పీజీ పూర్తి చేసిన ఆమె ఎన్నో సంవత్సరాల క్రితమే అమెరికా వెళ్లి స్థిరపడ్డారు.