: భర్త చెంతకు చేరిన ఎమ్మెల్యే కూతురు
తనకు ప్రాణహాని ఉందంటూ నిన్న గుంటూరు లీగల్ సర్వీసెస్ అథారిటీని ఆశ్రయించిన, ఎమ్మెల్యే ఈలి నాని కుమార్తె రమ్య తన భర్త చెంతకు చేరింది. ఈ రోజు గుంటూరులో రమ్య, తన భర్త సందీప్ దండలు మార్చుకున్నారు. ఇప్పటికీ తనకు ప్రాణహాని ఉందనీ, ఇక తల్లిదండ్రుల వద్దకు వెళ్లదలచుకోలేదని ఆమె చెప్పింది. సందీప్ ను నాలుగేళ్ల క్రితమే వివాహం చేసుకోగా, తన తండ్రి మరో పెళ్లి చేయాలని చూస్తున్నాడంటూ రమ్య నిన్న న్యాయమూర్తి ముందు మొరపెట్టుకున్న సంగతి తెలిసిందే. తన తండ్రే సందీప్ ను పోలీసులతో కిడ్నాప్ చేయించారని, తనను నాలుగేళ్లుగా ఇంట్లో నిర్బంధించారని ఆరోపించింది. దీంతో పోలీసులు సందీప్ ను గుంటూరుకు తీసుకొచ్చి న్యాయమూర్తి ముందు హాజరు పరిచిన సంగతి విదితమే.