: మాసివ్... 9000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన సరికొత్త ఫోన్


మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం ఎంత? మహా అయితే 2500 ఎంఏహెచ్, లేదా 3000 ఎంఏహెచ్ వరకూ ఉంటుంది. ఒకసారి చార్జింగ్ పెడితే ఎంత సేపు పనిచేస్తుంది? డేటా ఆన్ చేయకుండా వాడితే, గరిష్ఠంగా 24 గంటలు... అవేగా మీ సమాధానాలు. తాజాగా 9000 ఎంఏహెచ్ బ్యాటరీతో కూడిన కొత్త స్మార్ట్ ఫోన్ ను చైనా సంస్థ మకూక్స్ విడుదల చేసింది. దీని పేరు 'ఈఎక్స్ 1'. ఎలా వాడినా నాలుగైదు రోజుల పాటు దీనికి చార్జింగ్ అవసరం లేదని సంస్థ నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతానికి ప్రపంచంలో అత్యధిక బ్యాటరీ కెపాసిటీ ఉన్న ఫోన్ ఇదేనని ప్రకటించారు. ఈ ఫోన్ 15 మిల్లీ మీటర్ల మందం ఉండగా, 4.5 అంగుళాల డిస్ ప్లే, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, క్వాడ్ కోర్ ప్రాసెసర్, 8/2 ఎంపీ కెమెరాలు ఉన్నాయట. దీని ధర తదితర మరింత సమాచారం వెల్లడికావాల్సి వుంది.

  • Loading...

More Telugu News