: తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోంది: కల్వకుంట్ల కవిత ధ్వజం


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, నిజామాబాదు ఎంపీ కల్వకుంట్ల కవిత కొద్దిసేపటి క్రితం కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న నరేంద్ర మోదీ సర్కారు తెలంగాణ పట్ల పూర్తిగా వివక్ష ధోరణిని అవలంబిస్తోందని ఆమె నిజామాబాదులో ఆరోపించారు. గడచిన 16 నెలల కాలంలో ఏపీకి రూ.8వేల కోట్ల నిధులను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ను, తెలంగాణను బద్నాం చేయడమే లక్ష్యంగా కేంద్రం వ్యవహరిస్తోందని ఆరోపించారు. నిధుల విడుదల కోసం ఎంపీలుగా తాము కేంద్రానికి పలు నివేదికలు ఇచ్చామని ఆమె చెప్పారు.

  • Loading...

More Telugu News