: సైనాకు గాయం... హాంగ్ కాంగ్ సూపర్ సిరీస్ కు దూరం
ఇండియన్ ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ కాలి గాయంతో రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోనుంది. కుడి కాలి నొప్పి కారణంగా హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో ఆమె స్కానింగ్ చేయించుకుంది. ఈ క్రమంలో, ఆమె కాలి ఎముక తీవ్ర ఒత్తిడికి గురైందని... రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ విషయాన్ని సైనా తండ్రి వెల్లడించారు. ఈ నేపథ్యంలో, హాంగ్ కాంగ్ సూపర్ సిరీస్ కు సైనా దూరమయింది. సైనా తప్పుకోవడంతో... సూపర్ సిరీస్ లో తెలుగు తేజం పీవీ సిందు భారత మహిళల పోరుకు నాయకత్వం వహించనుంది.