: నితీశ్ ప్రమాణంపై పొగమంచు ఎఫెక్ట్... రాలేకపోతున్నామని చెప్పిన అఖిలేశ్
ఇప్పటికే రెండు పర్యాయాలు బీహార్ ముఖ్యమంత్రిగా పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న జేడీయూ నేత నితీశ్ కుమార్, ముచ్చటగా మూడోసారి పీఠం అధిష్టించనున్నారు. ఈ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. అయితే, ఈ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు ప్రయాణమైన ప్రముఖుల విమానాలు పొగమంచు కారణంగా ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ కారణంగానే ఉత్తర ప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్ ఏకంగా ఈ కార్యక్రమాన్నే రద్దు చేసుకున్నారు. ఈ మేరకు నేటి ఉదయం సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత శివపాల్ యాదవ్ నేరుగా నితీశ్ కు ఫోన్ చేసి తాను, తమ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ పాట్నా రాలేకపోతున్నారని చెప్పేశారు. మిగిలిన ప్రముఖుల్లోనూ కొందరు ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టే అవకాశాలున్నట్లు సమాచారం.