: అంతర్జాతీయ ఆర్కిటెక్ట్ లకు రాజధాని ముఖ్య కార్యాలయాల డిజైన్ల బాధ్యత


ఏపీ రాజధాని అమరావతి ఆర్కిటెక్చర్ ఎంపికపై విజయవాడలోని గేట్ వే హోటల్ లో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. మూడు ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులు, సీఆర్ డీఏ అధికారులతో సీఎం చర్చించారు. ఈ క్రమంలో రాజధాని ప్రాంతంలో ప్రధాన కార్యాలయాల నిర్మాణ డిజైన్లు రూపొందించే బాధ్యతను అంతర్జాతీయ ఆర్కిటెక్ట్ లకు అప్పగించాలని నిర్ణయించారు. అంతేగాక ఫైనల్ డిజైన్ల ఎంపికకు ఐదుగురు సభ్యులతో జ్యూరీ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సచివాలయం, అసెంబ్లీ, రాజ్ భవన్ నిర్మాణాలు ప్రపంచస్థాయిలో వినూత్నంగా ఉండేలా నిర్మాణం చేపట్టాలని చంద్రబాబు సమావేశంలో పేర్కొన్నారు. ఫిబ్రవరి చివరి నాటికి ఫైనల్ డిజన్ ఖరారు చేస్తామని, జూన్ నుంచి భవన నిర్మాణాలు ప్రారంభిస్తామని సీఆర్ డీఏ సెక్రెటరీ అజయ్ జైన్ తెలిపారు.

  • Loading...

More Telugu News