: మధ్యప్రదేశ్ గవర్నర్ కు సుప్రీంకోర్టు నోటీసులు... వ్యాపం కేసులో ఆరోపణలే నేపథ్యం


దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన వ్యాపం కుంభకోణంలో కొద్దిసేపటి క్రితం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మధ్యప్రదేశ్ గవర్నర్ రాంనరేశ్ యాదవ్ కు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మధ్యప్రదేశ్ లో మెడికల్ సీట్లు, పలు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీలో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుంది. ఈ కేసులో బడా రాజకీయ నేతల ప్రమేయం ఉంది. ఈ క్రమంలోనే ఈ కేసుతో సంబంధమున్న పలువురు అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ తరహా మరణాలు మధ్యప్రదేశ్ లోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

  • Loading...

More Telugu News