: మాజీ ఎంపీ రాజయ్య కుటుంబసభ్యుల రిమాండ్ పొడిగింపు


వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ ఎంపీ రాజయ్య, ఆయన భార్య మాధవిల జ్యుడీషియల్ రిమాండును కోర్టు మరో 15 రోజులు పొడిగించింది. జైల్లో ఉన్న వారిని 'జైలు-జిల్లా కోర్టు'ను అనుసంధానిస్తూ ఏర్పాటు చేసిన వీడియో లింకేజి ద్వారా జైలు అధికారులు హాజరుపర్చారు. దాంతో న్యాయమూర్తి వారికి వచ్చే నెల 3వరకు రిమాండ్ గడువును పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. ఇదే కేసులో విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్న ప్రధాన నిందితుడైన సారిక భర్త అనిల్ కుమార్ కు కూడా అప్పటివరకు రిమాండ్ కు ఆదేశించారు. కాగా నిన్న (గురువారం) రాజయ్య దంపతులకు కోర్టు బెయిల్ తిరస్కరించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News